మెల్ బోర్న్ నగరంలోని రాక్ బ్యాంక్ దుర్గామాత ఆలయంలో మెల్ బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత 10 సంవత్సరాలుగా మెల్ బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి , దీపక్ గద్దె ఆస్ట్రేయాలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెలు సమర్పించి తమ మొక్కును చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా పోతురాజుల ఆట, పాటలు యువకుల నృత్యాలతో దుర్గామాత ఆలయంలో సందడి నెలకొంది. బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

















