టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. తెలంగాణలో కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు సూచనల మేరకు సౌత్ ఆఫ్రికా శాఖ ఆధ్వర్యంలో తమ వంతు బాధ్యతగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో వరద ముందపునకు గురైన 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పర్ణశాల గ్రామంలో పంపిణీ చేశారు. కోర్ కమిటీ సభ్యులు నరేష్ తేజ యాదారి, గుండా జై విష్ణు సారథ్యంలో గిఫ్గ్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సరుకులు అందజేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)