తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కార్యవర్గ సభ్యులు యూకే ఎన్హెచ్ఎస్లై రక్తదానం చేశారు. అశోక్ దూసరి ఆధ్వర్యంలో కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. బంగారు తెలంగాణ కోసం మంత్రి కేటీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. అనంతరం టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ భారత్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటీరంగంలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలపడంలో కేటీఆర్ కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అడ్వైజర్ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్, కార్యదర్శులు సత్య చిలుముల, సృజన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సతీశ్ రెడ్డి, గణేశ్, నిఖిల్ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)