Namaste NRI

వాసవీ క్లబ్‌ మెర్లయన్‌ సింగపూర్‌ ఆధ్వర్యంలో.. ఘనంగా కార్తిక వన భోజనాలు

వాసవీ క్లబ్‌ మెర్లయన్‌ సింగపూర్‌ ఆధ్వర్యంలో కార్తిక వన భోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. సింగపూర్‌ లోని కుసు ద్వీపంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమానికి 200 మంది ఆర్య వైశ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు.  ముందుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి ఫలాలపై వత్తు లను వెలిగించి భక్తి ప్రపత్తులతో కార్తీక సమారాధనను చేశారు. కార్యనిర్వాహక బృంద సభ్యులైన ముక్క కిశోర్‌ కుటుంబం పూజకు కావలసిన ఏర్పాట్లు చేయగా, ఫణేష్‌ ఆత్మూరి కార్తికమాస విశిష్టతను, వన భోజనాల ఆంతర్యాన్ని వివరించారు. కిశోర్‌ శెట్టి ఆధ్వర్యంలో పలువురు ఔత్సాహిక కళాకారులు తమ ఆట పాటలతో ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిథ కనబరిచిన వారికి బహుమతులు అందించారు.  ఆశర్య వైశ్యులందరూ ఉత్సాహంగా పాల్గొనటం ఆనందంగా ఉందని, మరిన్ని కార్యక్రమాలని నిర్వహించాలనే స్ఫూర్తిని నింపిందని వీసీఎమ్‌ఎస్‌ సెక్రటరీ సుమన్‌ రాయల అన్నారు.  కార్యక్రమం సజావుగా సాగేందుకు సహకరించిన కమిటీ సభ్యులకు ముఖ్యంగా వినయ్‌ బత్నూర్‌, రాజశేఖర్‌ విశ్వనాథుల, కిశోర్‌ శెట్టి, ముక్క కిశోర్‌, ఫణేస్‌ ఆత్మరిలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయానికి తమ చేయూతనందించిన వాసవి సేవాదళ్‌ సభ్యులు నిఖిల్‌ ముక్కావార్‌, జయకుమార్‌ పంచనాథన్‌, శివకిషన్‌ కరే, దత్త కొత్తమసు, విజయ్‌ మద్దాలి, లిఖిత కుంజిజివాల్‌ కాచం, ఆంజనేయులు చలవాదిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి ఆర్థిక చేయూతనందించి ఎస్‌బీఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌ ఫర్‌ ఎన్‌ఆర్‌ఐఎస్‌, లహరిశ్రీ నృత్య నికేతన్‌ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ అకాడమీ, సౌజన్య హెమ్‌ డెకార్స్‌, మల్లిక్‌ పాలేపులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress