Namaste NRI

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం : మంత్రి ఎర్రబెల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆటా మహాసభల్లో టీఆర్‌ఎస్‌ ప్రవాస విభాగం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి పాల్గొని   ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి విదేశాల్లోని ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాల వారు గర్వపడుతున్నారని తెలిపారు. తెలుగు వాళ్లమంతా ఒక్క చోట కలవడం ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటే అని చాటే గొప్ప సందర్భంగా ఆట మహాసభల ద్వారా సాధ్యమైందన్నారు. మనం ఎక్కడ ఉన్న మన దేశ భక్తిని, కన్నతల్లిని, పుట్టిన ఊరిని మరచిపోకుండా ఆటా ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దేశాభివృద్ధిలో మన వంతు భాగస్వామ్యం అందిస్తూ మనమే ముందున్నామని తెలిపారు. ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మన యాస, భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు.      

                 ఈ  కార్యక్రమంలో మంత్రులు మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రవీంద్ర కుమార్, చంటి క్రాంతి కిరణ్, గాదరి కిషోర్కుమార్‌, టీఎస్‌ ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు,  ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంత రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రవాస విభాగం ప్రతినిధులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు ,తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events