Namaste NRI

తానా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  సాంస్కృతిక కళా మహోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహణలో సాంస్కృతిక కళా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఆస్టిన్‌లో సౌత్‌ వెస్ట్‌ రీజియన్‌ కో ఆర్డినేటర్‌ సుమంత్‌  పుసులూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 100 మంది శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు వంటి వివిధ సాంస్కృతిక కళలను ప్రదర్శించారు.  కుటుంబసమేతంగా 400 మంది ఈ కార్యక్రమం వీక్షించటానికి పాల్గొన్నారు. ఇందులో భాగంగా తానా సాంస్కృతిక కళా మహోత్సవం కార్యక్రమ నిర్వహణలో శ్రీధర్‌ పోలవరపు, ప్రసాద్‌ కాకుమాను, బాలాజీ పర్వతనేని, లెనిన్‌ ఎర్రం, సతీష్‌ గన్నమనేని, సూరయ ముళ్ళపూడి, విగ్నేష్‌, సౌత్‌ వెస్ట్‌ రీజియన్‌ తానా వాలంటీర్స్‌ భాగస్వాములు అయ్యారు.

fc3b6d1f 9e06 4fe2 8f24 38b9bee37533
Mayfair 121
6235199c 88c4 4820 adad 7e6f3b13e8cc
Ixora 121
d4a26616 2086 4276 8f4f 04cfa54e06fa
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events