Namaste NRI

విడుదలకు సిద్ధమైన అనుకోని ప్రయాణం

రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా అనుకోని ప్రయాణం. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ నా సినీ ప్రయాణంలో కొన్ని కథలు ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా కూడా అలా అవాక్కయేలా చేసింది. కరోనా సమయస్త్రంలో వలస కూలీల వ్యథల నుంచి పుట్టిన కథ ఇది. ఇద్దరు స్నేహితుల గొప్ప స్నేహాన్ని ఈ చిత్రంలో చూస్తారు అని అన్నారు. లాక్‌ డౌన్‌లో వాస్తవ ఘటనలు చూసిన స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నారు. సినిమాలోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయబోతున్నాం అని దర్శకుడు వెంకటేష్‌ పెద్దిరెడ్ల అన్నారు. నటుడు నరసింహరాజు మాట్లాడుతూ చుట్టుపక్కల వారికి ఎంతో సేవ చేసిన గొప్ప వైద్యులు డా.జగన్‌మోహన్‌. ఆయన సినీ నిర్మాణంలో రావడం, ఇలాంటి ఓ మంచి కథని తీయడం ఓ గొప్ప పరిణామం. రాజేంద్రప్రసాద్‌తో కలిని నటిస్తున్నప్పుడు ప్రతీ సన్నివేశం లోనూ నవ్వుకున్నా. ప్రేక్షకులు కూడా అదే అనుభూతికి గురవుతారు. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌ సమర్పణలో ఆపిల్‌ క్రియేషన్స్‌ పతాకంపై డా॥ జగన్‌ మోహన్‌ డి.వై.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events