మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా క్రిమిసంహాకరాలను నశింపచేసి గాలిని శుద్ధి చేసే బైపోలార్ ప్యూరిఫయర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ బైపోలార్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను జైత్ర డివైజెస్, సిస్టమ్స్ సంస్థ రూపొందించింది. ప్రస్తుత కరోనా కాలంలో స్వచ్ఛమైన గాలిని అందించే పరికరాన్ని రూపొందించినందుకు జైత్ర కంపెనీ ప్రతినిధులు కిషన్ రెడ్డి అభినందించారు. 1970 దశకంలో ఆహార శుద్ధి కోసం ఈ సాంకేతికతను ఉపయోగించారని తెలిపారు. జైత్ర బైపోలార్ అయోనైజేషన్ టెక్నాలజీ యంత్రం కొవిడ్‌ను కట్టడి చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్స్ విజన్ ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, జైత్ర కంపెనీ కో చైర్మన్ కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జైపోలార్ ప్యూరిఫయర్ యంత్రం గాలిలో బ్యాక్టిరియా కణ త్వచ ఉపరితలంపై రసాయన ప్రతిచర్యను జరిపి హానికరమైన సూక్ష్మజీవులను అంతం చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందన్నారు. జైత్ర ఎయిర్ ప్యూరిఫయర్ అత్యంత సురక్షితమైన, పర్యావరణహితమైన పరికరం అని స్పష్టం చేశారు.














