రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎపిఓ22 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరో రామ్ పాత్ర వినూత్న పంథాలో ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది.

ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. సూర్యకుమార్‌గా ఆయన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. న్యాయం కోసం ప్రజల పక్షాన పోరాడే ప్రతినిధిగా ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. ఉపేంద్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ నెల 15న సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్-మెర్విన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.
