
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయుధాలు కలిగి ఉన్న ఓ దుండగుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో లేరని, సమాచారం. ఆత్మాహుతి దళ సభ్యుడు వస్తున్నట్టు ఇండియానా నుంచి సమాచారం అందింది. అతడిని పట్టుకునే క్రమంలో అతడిపై కాల్పులు జరిపారు.
