Skip to main content

Namaste NRI

ఊరు పేరు భైరవకోన రిలీజ్ – ఎప్పుడంటే?

సందీప్ కిషన్ ‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ఊరు పేరు భైరవకోన. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ కథానాయికలు. వీఐ ఆనంద్‌ దర్శకత్వం. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఊరు పేరు భైరవ కోన రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.

ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వుండబోతుంది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు- నిజమేనే చెబు తున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తు న్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరి గాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News