అల్లు శిరీష్ కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్మానుయేల్ కథానాయిక. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాకి మొదటి ప్రేమ కాదంట అనే పేరును ప్రకటించారు. ఇప్పుడు ఆ పేరుకి బదులుగా ఊర్వశివో రాక్షసివో అని మార్చినట్టు చిత్రబృందం అధికారికంగా తెలిపింది. చిత్ర టైటిల్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్, అను ఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్‌గా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతుంది. ఈ నెల 29న టీజర్‌ని విడుదల చేయనున్నాం. నవంబరు 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. యువతరం ఆలోచనల్ని అద్దం పట్టే కథ ఇది. ప్రేమ, హాస్యం, కీలకం. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం : అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం: తన్వీర్, సహ నిర్మాత: ఎం. విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :బాబు.














