Skip to main content

Namaste NRI

నెలరోజులపాటు ఆంక్షల ఎత్తివేత ..భారత్‌కు అమెరికా అనుమతి

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా తాత్కాలిక అనుమతినిచ్చింది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో భారత్‌ చమురు కొరతను ఎదుర్కొనే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అనిశ్చితి, రవాణాలో తీవ్ర అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. ట్యాంకర్లలో నింపి ఉంచి, ఎక్కడా అమ్ముడు పోకుండా సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా చమురును భారత్‌ నెలరోజులపాటు కొనుగోలు చేయవచ్చని అమెరికా తెలిపింది.

భారత్‌పై ఆంక్షలు విధించకమునుపే ట్యాంకర్లలో లోడ్‌ చేసిన చమురుకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ స్పష్టంచేశారు. భారత్‌కు తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. భారత్‌ త్వరలోనే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను వేగవంతం చేస్తుందని ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి చమురు సరఫరాను సరళతరం చేసేందుకే ఈ 30 రోజుల ఆంక్షల ఎత్తివేతను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ వెసులుబాటు వల్ల భారత్‌లోని రిఫైనరీలు రష్యా చమురును కొనుగోలు చేయవచ్చని అన్నారు.

Social Share Spread Message

Latest News