హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వచ్చే వార్సికోత్సవాన్ని నూతన ప్రాంగణంలో నిర్వహించుకోనున్నట్లు కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. హైదరాబాద్‌లో కాన్సులేట్ ప్రస్తుత కార్యాలయాన్ని 2008 అక్టోబరు 24న ప్రారంభించి 14 సంవత్సరాలు పూర్తి చేయటం ఆనందంగా ఉందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 300 మిలియన్ డాలర్ల వ్యయంతో నూతన ప్రాంగణ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలో ఆ ప్రాంగణంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాం. 254 వర్కింగ్ డెస్క్‌లతో పాటు అమెరికా పాస్‌పోర్టు, వీసా ఇంటర్వ్యూల నిర్వహణకు 54 విండోస్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాన్సులేట్ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు వీసాలు జారీ చేయటంతో పాటు అమెరికాతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.