Namaste NRI

బెలారస్‌ దేశానికి అమెరికా గట్టి వార్నింగ్‌

ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధానికి పరోక్ష సాయం అందిస్తున్న బెలారస్‌ దేశానికి అమెరికా గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇది ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్‌ పై పుతిన్‌ దురాక్రమణకు లుకషెంకో  తన మద్దతు ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైజ్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ పొరుగు దేశమే బెలారస్‌. అణు రహిత హోదా కలిగిన దేశం కానీ, తాజా పరిణామాలతో ఈ హోదాను వదిలేసుకుంది. ఉక్రెయిన్‌ పై రష్యా అణ్వాయుధాలను తన భూభాగం నుంచి ఎక్కు పెట్టేందుకు అనుమతించింది. రష్యాకు మద్దతు ఉక్రెయిన్‌ పై బెలారస్‌ కూడ సైనిక చర్యకు దిగొచ్చని అమెరికా భావిస్తోంది.

ఉక్రెయిన్‌, రష్యా మధ్య చర్చలకు కూడా బెలారస్‌ వేదికగా నిలవడం గమనార్హం. దీంతో బెలారస్‌ తీరుపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బెలారస్‌ అధినేత అలెగ్జాండర్‌ లుకాంషెంకో కూడా తన కార్యనిర్వాహఖ అధికారాలను గణనీయంగా పెంచుకోగా.. జపాన్‌ సహా పలు దేశాలు రష్యాకు మద్దతు ఇస్తోందన్న కారణంతోనే యూరోపియన్‌ దేశం బెలారస్‌ పైనా ఆంక్షలు మొదలు పెట్టాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events