హెచ్`1బీ వీసాలకు సంబంధించిన అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. 2022 అక్టోబర్ నుంచి కొత్త్త హెచ్`1బీ వీసాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడిరచింది. అభ్యర్థులు మార్చి 1, 2022 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్విసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 18న ముగియనున్నట్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు (సుమారు రూ.750) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. హెచ్`1బీ వీసాకు ఎంపికైన అభ్యర్థులకు మార్చి 31 లోపు సమాచారం చేరవేయనున్నట్టు పేర్కొంది. అమెరికా ప్రతి ఏటా విదేశీయులకు 65 వేల హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్`1బీ వీసాలు మాస్టర్ క్యాప్ (అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. సుమారు 70 శాతం వీసాలు (దాదాపు 60 వేలు) భారతీయులకు జారీ అవుతున్నట్లు సమాచారం. ఇలా ప్రతి ఏడాది అమెరికా విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85 వేల హెచ్ `1బీ వీసాలు జారీ చేస్తోంది.