అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడు నెలల తరువాత మొదటమొటిసారి ఫోన్ ద్వారా చర్చలు జరిగాయి. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. అమెరికా, చైనా మధ్య పోటీ వివాదంగా మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇరువురు నాయకులు విస్తృతమైన అంశాలపై చర్చించుకొన్నారు. ఇరు దేశాల అవసరాలు, విలువలు, విధానాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పోటీ విషయంలో అమెరికా తీసుకొంటున్న చర్యలను అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంగా వెల్లడిరచారని శ్వేత సౌధం పేర్కొంది. చైనాలోని కింది స్థాయి అధికారులు అమెరికాతో చర్చలకు సానుకూలంగా స్పందించకపోవడంపై బైడెన్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనే చొరవ తీసుకుని చైనా అధ్యక్షుడికి ఫోన్ చేశారు.