అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10న జరుగనున్న జీ20 సమ్మిట్ లో పాల్గొనేందుకు 80 ఏండ్ల జో బైడెన్ తొలిసారి ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో విమానం దిగిన తర్వాత హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీనిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించనున్నారు. క్లీన్ ఎనర్జీ, ట్రేడ్, హైటెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య మరింత ఉదారమైన వీసా పాలసీ ఉండాలని మోదీ, జో బైడెన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వారిద్దరి మధ్య చర్చ జరుగవచ్చని తెలుస్తున్నది.
