అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. అమెరికాలో అతిపెద్ద టీచర్స్ యూనియన్ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్లో ప్రసంగిస్తూ తన స్నేహం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వయసుకి సంబందించి చాలా ఏళ్లు వెనక్కి వెళ్లాంటూ ప్రసంగాన్ని ప్రారంభించడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా బైడెన్ వ్యాఖ్యలను తిలకించ సాగారు. ఇంతలో బైడెన్ అక్కడ ఉన్న ఒక మహిళా ఉపాధ్యాయురాలిని చూస్తూ తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడూ 12 ఏళ్ల బాలికతో స్నేహం చేశానని తెలిపారు. వయసు భేదం ఉన్నప్పటికీ ఆమె నాకు చాలా పనుల్లో సహయం చేసింది అన్నారు. అంతే ఆ సమావేశంలో ఒక్కసారిగా అందరి ముఖాలపై నవ్వులు విరబూశాయి. ఏదేమైనా బైడెన్ వ్యాఖ్యలు చాలా మంది డిస్టర్బ్ చేస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)