Namaste NRI

అమెరికా అధ్యక్షుడు- చైనా అధినేత భేటీకి రంగం సిద్ధం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధినేత జీ జిన్‌పింగ్‌్‌ భేటీకి రంగం సిద్దమయ్యింది. వారిద్దరూ వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ నెల 15వ తేదీన వీడియో కాల్‌ ద్వారా ఇరువురు నేతలు మాట్లాడుకోనున్నారు. ఈ భేటీ ద్వారా పెద్దగా ఆశించాల్సింది ఏమీ ఉండదని వైట్‌హౌస్‌ అధికార వర్గాలు పరోక్షంగా సంకేతాలిస్తున్నాయి. అమెరికా, చైనా ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కలిసి పనిచేసే దిశగా బైడెన్‌, జిన్‌పింగ్‌ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ తెలిపారు. అమెరికా ఉద్దేశాలు, ప్రాధాన్యతలను బైడెన్‌ చైనా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు.

                బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు క్షీణించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల నడుమ ఉద్రికత్తలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బైడెన్‌, జిన్‌పింగ్‌ సమావేశం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.  ఈ  ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాక ఇరువురు నేతలు మాట్లాడుకుంటుండడం ఇది మూడోసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చైనా వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events