రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరామర్శించారు. కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌లో నావల్నీ భార్య యులియా, కుమార్తె దాశాని బైడెన్ కలిశారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నావల్నీ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు.
