అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆయన పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి ఆయుధ సహాయంపై ఇరు దేశాధ్యక్షులు చర్చించుకున్నారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లు, ఇతర ఆయుధాలను త్వరగా పంపించాలని బైడెన్‌ను జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు లక్షల డాలర్ల సాయాన్ని అందిస్తామని, యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్లు పంపిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. . బైడెన్‌తో షేక్‌హ్యాండ్ ఇస్తున్న ఫోటోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన టెలిగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కొన్ని క్షణాల క్రితమే ఆయన ఆ ఫోటో షేర్ చేశారు. బైడెన్, వెల్కమ్ టు కీవ్ అని తెలిపారు. ఉక్రేనియన్ల మద్దతుకు మీ రాక చాలా అవసరమని జెలెన్‌స్కీ తెలిపారు.