Namaste NRI

భారత్ పై అమెరికా ఆంక్షలు ?

రష్యాతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి అమెరికా నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఎందకంటే.. రష్యా నుంచి ఎస్‌`400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భారత్‌ నిర్ణయించింది. ఈ మేరకు 2018లో రష్యాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఎస్‌`400 ఎయిర్‌ డిఫెన్స్‌ ఐదు యూనిట్లు భారత్‌కు రష్యా అందించనుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా భారత్‌పై ఆంక్షలు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరిక చేశారు. అయినా భారత్‌ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ముందుకు సాగుతోంది. 

                  తాజాగా అధ్యక్షుడు బైడెన్‌ ప్రభుత్వం భారత్‌పై ఆంక్షలు విధించే అంశంపై పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడి ప్రతినిధి, ఆంక్షల  విధాన సమన్వయకర్త జేమ్స్‌ ఓ బ్రియన్‌ పేర్కొన్నారు. సీఏఏటీఎస్‌ఏ ( కౌంటరింగ్‌ అమెరికన్ల విరోధులను ఆంక్షల చట్టం) ద్వారా భారత్‌పై ఆంక్షలు విధించే అంశం పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఇటీవల రష్యా నుంచి ఎస్‌`400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అదే అస్త్రాన్ని భారత్‌పైనా విధించనుందని సూచన ప్రాయంగా వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events