అమెరికాలో ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన వివాదాస్పద బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కు సెనేట్‌లో తుది ఆమోదం లభించింది. పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించి తీసుకొచ్చిన 1000 పేజీల ఈ బిల్లుపై సెనేట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా, బిల్లుకు అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి.

చివరికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై-బ్రేకర్‌గా మారి బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు గట్టెక్కింది. 51-50 ఓట్లతో ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందినట్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ బిల్లును అధికారపార్టీకి చెందిన ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. సెనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందిన అనంతరం అధ్యక్షుడి వద్దకు చేరుతుంది.















