
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్‌ను సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. వాన్స్, ఆయన కుటుంబం ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీ, భారత్‌లో పర్యటించనున్నారు. ఆర్థిక భాగస్వామ్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఉపాధ్యక్షుడు ఆయా దేశాల నాయకులతో చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం తెలిపింది. భారత పర్యటనలో ప్రధాని మోదీతో వాన్స్ సమావేశమవుతారని, న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాను సందర్శిస్తారని ఆయన కార్యాలయం పేర్కొన్నది.
