వచ్చే నెల నుంచి జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ కోసం అమెరికా తన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో అందరూ భారత సంతతికి చెందిన మహిళలే కావడం గమనార్హం. దక్షిణాప్రికా వేదికగా జనవరి 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకంతో కూడిన గ్రూప్`ఎ యూఎస్‌ఏ తలపడనుంది. గీతికా కొడాలి (కెప్టెన్), అనికా కొలన్ ( వైస్ కెప్టెన్), అదితి చదుసామ, భూమిక భద్రిరాజు, దిశా దింగ్రా, ఇసాని వంగేలా, జినావా అరాస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేశ్, పూజా షా, రితు సింగ్, సాయి తన్మయి ఈయున్ని స్నిగ్ద పాల్, సుహాని తదాని, తరనుమ్ చోప్రా. రిజర్వ్ చేత్నా ప్రసాద్ కస్తూరి వేదాంతమ్, లిసా రంజిత్, మిథాలీ పట్వార్దాన్, టై. గోన్సాల్వేస్. ఇందులో కెప్టెన్, వైఎస్ కెప్టెన్ సహా తెలుగు రాష్ట్రాల నేపథ్యం ఉన్నవారే ఐదుగురు ఉండటం విశేషం.