పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లో అశుతోష్ రానా, నవాబ్‌షా తదితరులు నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో భారీ పోరాటఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. వీటికోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ ఖాకీ దుస్తులు ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు.
మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ను వినూత్న రీతిలో ప్రజెంట్ చేయబోతున్నాడు. పోలీస్ పాత్రలో ఆయన పర్‌ఫార్మెన్స్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: హరీష్‌శంకర్.