పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల కథానాయిక. హరీష్‌శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి భారీ సెట్‌ను నిర్మించారు. కొన్ని మాసాల క్రితం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్‌సాయి, స్క్రీన్‌ప్లే: కె. దశరథ్, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.ఎస్.
