పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. హరీష్‌శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. శ్రీలీల, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌గ్లింప్స్‌ను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఘంటసాల భగవద్గీత శ్లోకంతో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో భగత్..భగత్‌సింగ్, మహంకాళి పోలీస్‌స్టేషన్.. పాతబస్తీ అనే డైలాగ్ చెబుతూ పవన్‌కల్యాణ్ ఎంట్రీ అభిమానుల్ని అలరించేలా ఉంది.
ఈసారి పర్‌ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్‌కల్యాణ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్‌శంకర్ మాట్లాడుతూ గబ్బర్‌సింగ్ నుంచి భగత్‌సింగ్ వరకు ఇది నా పదకొండేండ్ల ఆకలి. ఈ క్షణం కోసం 11ఏండ్లుగా ఎదురుచూస్తున్నా. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంకా బోస్, సంగీతం:దేవిశ్రీప్రసాద్, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: హరీష్ శంకర్.