వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఛేజింగ్. హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు యాక్షన్ క్రైమ్ జానర్లో దర్శకుడు వీరకుమార్ విభిన్న కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఆమెను ఇప్పటి వరకు చూడని కొత్త క్యారెక్టర్లో చూస్తారు. మాకు నిర్మాతలుగా తొలి ప్రయత్నమైనా ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం అన్నారు. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ పతాకాలపై జి వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి నిర్మించారు. కె వీరకుమార్ దర్శకుడు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, సూర్య కిరణ్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)