Skip to main content

Namaste NRI

అల్లు అర్జున్‌ను ఆహ్వానించిన‌ వరలక్ష్మి శరత్ కుమార్

త‌మిళ న‌టి వరలక్ష్మి శ‌ర‌త్ కుమార్ త్వరలోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నా రు. ఈ ఏడాది మార్చిలో వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఘ‌నంగా జ‌రిగింది. ఇక జూలైలో వీరి వివాహం జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పెళ్లి వేడుక‌ల‌కు సిద్దమవుతుంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఉన్న పలువురు సినీ ప్ర‌ముఖులతో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులను ఆహ్వానించిన వరలక్ష్మి తాజాగా టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులను త‌మ పెళ్లికి ర‌మ్మని ఆహ్వానిస్తుంది.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు అత‌ని తండ్రి అల్లు అర‌వింద్‌కు కూడా త‌న పెళ్లికి ర‌మ్మ‌ని ఆహ్వానించింది. ఇక అల్లు అర్జున్‌కు వెడ్డింగ్ కార్డు ఇవ్వ‌డానికి వరలక్ష్మి ప్రియుడు నిచోలై సచ్‌దేవ్ కూడా వ‌చ్చాడు.  టాలీవుడ్‌లో ఇంత‌కుముందే అడివి శేష్‌తో పాటు, ర‌వితేజ, ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌, న‌టి సమంత, పైడిప‌ల్లి వంశీ, త‌మ‌న్, గోపిచంద్ మ‌లినేని త‌దిత‌రులను ఆహ్వానించింది.

Social Share Spread Message

Latest News