వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. మహర్షి కూండ్ల సమర్పకులు. ఇటీవల కొడైకెనాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. దర్శకుడు మాట్లాడుతూ కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసం చుట్టూ సాదే కథ ఇది. వరలక్ష్మి శరత్ కుమార్ స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా కనిపిస్తారు. ప్రాణాల్ని పణంగా పెట్టి కంటికి కనిపించని చీకటి మృగంతో ఒంటరి సైన్యంలా పోరాడే తల్లిగా, మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తారని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ బలమైన కథ ఇది. నేర నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలు కీలకం అన్నారు. నా కెరీర్లో ఉత్తమ పాత్రగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. కొడైకెనాల్లో పద్నాలుగా రోజుల పాటు కీలక ఘట్టాలను తెరకెక్కించామని నిర్మాత మహేంద్ర నాథ్ తెలిపారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: నాని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ కాట్జ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)