టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం బయటకు రావడంతో వరుణ్, లావణ్యలకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.