వరుణ్ తేజ్ హీరోగా తన 13వ చిత్రంలో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్ ముద్దా నిర్మాత. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ తార, మాజీ మిస్ యూనివర్స్ మానుషీ చిల్లర్ నాయికగా నటిస్తున్నది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ రాడార్ ఆఫీసర్గా ఆమె కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. భారత వాయుసేన సాహసాల నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్సింగ్ హడా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజాగా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం దేశభక్తితో కూడుకున్న ఎడ్జ్ అఫ్ సీట్ ఎంటర్ టైనర్. భారతదేశం ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని, వారు ఎదుర్కొనే సవాళ్లను చూపుతుంది. యుద్ధ క్షేత్రంలో మన వాయుసేన వీరుల సాహసాన్ని చూపించనుందీ సినిమా. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు.