Namaste NRI

లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.  మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు   వరుణ్‌తేజ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కథానాయిక లావణ్య త్రిపాఠితో ఆయన నిశ్చితార్థం నేడు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్‌కు సంబంధించిన టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. నాగబాబు ఇంట్లోనే నిశ్చితార్థం వేడుకలు జరుగనున్నట్టు సమాచారం.  నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సినీ ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో వివాహానికి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్‌ అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. తాజా నిశ్చితార్థ ప్రకటనతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలందజేస్తున్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress