Skip to main content

Namaste NRI

వరుణ్ తేజ్ నటించిన మట్కా చివరి షెడ్యూల్ షూటింగ్

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం మట్కా. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలు. కరుణకుమార్‌ దర్శకత్వం. డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా జరుగుతున్నది. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకునే ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తవుతుంది.

ఈ సినిమాలో వరుణ్‌ డిఫరెంట్‌ మేకోవర్‌లో కనిపించనున్నారని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సాఫీగా జరుగుతున్నాయనీ, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్‌ చెప్పారు.ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, సలోని, అజయ్‌ఘోష్‌, కన్నడ కిశోర్‌, రవీంద్రవిజయ్‌, పి.రవిశంకర్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కిశోర్‌కుమార్‌, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, నిర్మాణం: వైరా ఎంటైర్టెన్మెంట్స్‌, ఎస్‌.ఆర్‌.టి. ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News