
వరుణ్‌తేజ్ కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీగా తెరకెక్కించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైమెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. వరుణ్‌తేజ్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.
