ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాల కలబోతగా రూపొందిన వెబ్ సిరీస్ యక్షిణి. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ముఖ్య పాత్రధారులు. తేజ మార్ని దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ని నిర్మించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సిరీస్ ఇదని, దర్శకుడు తేజ మార్ని విజన్‌కు తగినట్టు భారీ నిర్మాణ విలువలతో ఈ సిరీస్‌ను నిర్మించామని, ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో, జూన్ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.