ఆదిత్య భరద్వాజ్, మహీరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విప్లవ సేనాని వీర గున్నమ్మ. గూన అప్పారావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా దర్శక గున అప్పారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట సమయంలో 1940 ఏప్రిల్ 1న రైతాంగం జరిపిన పోరాటాన్ని కథాంశంగా తీసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ నెల మూడోవారంలో చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఎల్ వి చలం, లజపతిరాయ్, హేంబాబు చౌదరి, చేపర వేణుగోపాల్, హేమసూదన్, ఎమ్ఎన్ మూర్తి, స్టాలిన్, బమ్మిడి కృష్ణారవు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః వందేమాతరం శ్రీనివాస్, చిన్నికృష్ణ, కెమెరాః ఇజాజ్ వెంకట్ రవి, ఎడిటర్ః వంశీ, పీఆర్వోః రమేష్ చందు, రచన-దర్శకత్వం-నిర్మాతః గూన అప్పారావు.