Namaste NRI

నాగబంధం సినిమా నుంచి వీరనాగ సాంగ్ రిలీజ్

ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటిలో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ నాగబంధం. విరాట్‌కర్ణ కథానాయకుడిగా, అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు.

తాజాగా ఈ సినిమా నుంచి వీరనాగ రహస్య రుద్ర సైన్యమే వీరనాగ సహస్త్ర కర్మయోగమే అంటూ సాగే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీహర్ష ఈమని రాసిన ఈ పాటను జునైద్‌ కుమార్‌-అభే స్వరపరచగా, దీపక్‌ బ్లూ ఆలపించారు. నాగసాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. కైలాస పర్వత ప్రాంతాలు, నాగసాధువుల తాండవం విజువల్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని, ఈ పాటలోని సినిమాటోగ్రఫీ, విజువల్స్‌ ఓ దివ్యదర్శనాన్ని తలపిస్తాయని, నాగసాధుగా విరాట్‌కర్ణ తాండవం, ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, స్క్రీన్‌ప్రెజెన్స్‌ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయని మేకర్స్‌ తెలిపారు. జగపతిబాబు, మహేశ్‌ మంజ్రేకర్‌, మురళీశర్మ, దక్ష నాగార్కర్‌ ఇందులో కీలక పాత్రధారులు.జులై 3న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events