నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని గోపీ చంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.