నందమూరి బాలకృష్ణ నటించిన 107 వ చిత్రం వీర సింహారెడ్డి. గల్ఫ్ దేశాలలోని బాలకృష్ణా అభిమానులలోనూ ఎనలేని ఆసక్తి రేపుతుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు దుబాయిలో జరిగిన ఫ్రీ రీలిజ్ సందర్భంగా దుబాయిలోని బాలయ్య అభిమానులు సందడి చేశారు. సినిమాలో బాలయ్య ధరించిన నల్లటి షర్టులు ధరించి మరీ అభిమానలు కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడి సినిమాను చూశారు. తెలుగుదేశం అభిమానులు విశ్వేశ్వరరావు, ఖాదర్ బాషా సాహుల్, సింగయ్య, వాసురెడ్డి, రవి, తరుణ్, నిఖీల్ మరియు భాను, మహిమలు ఘురేర్ మాల్ లోని స్టార్ సినిమా వద్ద సందడి చేసారు.