బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలోని మా బావ మనోభావాలు అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడిరచింది. ఇప్పటికే రిలీజైన జై బాలయ్య, సుగుణ సుందరి పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. చివరి పాట చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని చిత్రబృందం తెలిపింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనింగ్: ఎ.ఎస్. ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా.