సాయిరామ్ శంకర్, యాశ శివ కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం వెయ్ దరువెయ్. నవీన్ రెడ్డి దర్శకుడు. దేవరాజు పొత్తూరు నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. వైవిధ్యమైన కథతో దర్శకుడు చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దాడు. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. ఈ సినిమా లో సునీల్, కాశి విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని మార్చ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జనగాని కార్తీక్, శ్రీపాల్ చొల్లేటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)