Namaste NRI

కొలంబియా నగరంలో అంగరంగ వైభవంగా వేంకటేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

అమెరికా సౌత్‌ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి కొలువుదీరారు.  స్థానిక వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రెండు రోజుల్లో అంకురార్పణ, సంకల్పం, జలాధివాసం, భూమిపూజ, విష్ణు సహస్రనామ హోమం, శ్రీ దశావతార హోమం, పుష్పాధివాసం నిర్వహించారు. మూడో రోజు ఆరు అడుగుల స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అదేరోజు స్వామి వారి కళ్యాణం, రథోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమం భక్తులకు కనులవిందుగా నిలిచింది. విద్యాన్‌ శ్రీ శ్రీధర శ్రీనివాస భట్టాచార్య, శ్రీ మధుగిరి రాఘవ శ్రీనివాస నారాయణ భట్టార్‌ల ఆధ్వర్యంలో పదకొండు మంది ఋత్వికుల సమక్షంలో శాస్త్రోక్తంగా, నిర్విఘ్నంగా చేపట్టారు. 70 మంది వలంటీర్లు నెలరోజుల పాటు నిర్విరామంగా కృషి చేశారు.  ప్రతి రోజు అనేక వందలమంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నా రు. బెంగళూరుకు చెందిన వి.మురళీ నేతృత్వంలో ముగ్గురు విద్యాంసులతో కూడిన నాదస్వర బృందం కార్యక్రమం ఆసాంతం చక్కని సంగీతంతో అలరించారు. అట్లాంటా నుంచి వచ్చిన రామకృష్ణ దంపతులు  సాంప్రదాయక, రుచికర భోజనాలు వండిపెట్టారు. చివరి రోజున ఋత్వికులను, వలంటీర్లను నిర్వాహకులు సత్కరించారు. బాలబాలికల కోసం నిర్వహించిన దశావతార క్విజ్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు.

ధర్మకర్తల మండలి అధ్యక్షులు సత్య శ్రీనివాస దాస కడాలి మాట్లాడుతూ  మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణ, కల్కి, శ్రీ వెంకటేశ్వర రూప అంశలతో కూడిన శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి విగ్రహం అమెరికాలో మొదటిది, ప్రపంచంలోనే రెండవదని అన్నారు.

ఈ విగ్రహం ఎంత వైవిధ్యమో, అంతే విధంగా దాదాపు రెండు వేలమందికి  విగ్రహ ప్రతిష్ఠాపన ఆహ్వానం, స్వామి వారి అక్షింతలను వాలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించారు. ఈ దశావతార వెంకటేశ్వర  దేవస్థానం ఇక నుంచి ఒక పుణ్య తీర్థం రూపొంది, అమెరికా నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర ఆలయ ధర్మకర్తలు డాక్టర్‌ లక్ష్మణ్‌ రావు ఒద్దిరాజు, డా. అమర్నాథ్‌, ఆనంద్‌ పాడిరెడ్డి, శరత్‌ గొర్రెపాటి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress