దీపక్ సరోజ్ హీరోగా రూపొందిన చిత్రం సిద్ధార్థ్ రాయ్. తన్వి కథానాయిక. వి.యశస్వీ దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు. ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడారు. ఫస్టాఫ్కి యూత్, సెకండాఫ్‌కి పెద్దలు కనక్టవుతున్నారని, కమర్షియల్‌గా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నామని అన్నారు. హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ సిద్ధార్థ్‌రాయ్ కి మంచి స్పందన వస్తున్నది. నా కేరక్టరైజేషన్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త కథను చూడాలను కునేవారికి మా సినిమా సరైన ఆప్షన్. చూసినవారు ైక్లెమాక్స్ని రివీల్ చేయొద్దని కోరుతున్నాను అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)