Skip to main content

Namaste NRI

హిట్లర్‌గా విజయ్‌ ఆంటోని, మాస్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న టీజర్‌

విజయ్‌ ఆంటోని హీరోగా రూపొందిన చిత్రం హిట్లర్‌. ధన దర్శకుడు. డీటీ రాజా, డీఆర్‌ సంజయ్‌కుమార్‌ నిర్మాతలు. రియా సుమన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని చిత్రబృందం విడుదల చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే ఇది యాక్షన్‌ థ్రిల్లర్‌ అని అర్థమవుతున్నది. ఓ రాజకీయ నాయకుడు, అతడ్ని వేటాడే ఓ కిల్లర్‌,  ఆ కిల్లర్‌ ప్రయత్నాలను అడ్డుకునే ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి, ఈ ముగ్గురి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని టీజర్‌ చెప్పేస్తున్నది. యాక్షన్‌తోపాటు విజయ్‌ ఆంటోనీ మార్క్‌ లవ్‌ ట్రాక్‌ కూడా ఈ కథలో ఉన్నట్టు తెలుస్తున్నది. కిల్లర్‌గా విజయ్‌ ఆంటోనీ లుక్‌, కేరక్టరైజేషన్‌, నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. సాంకేతికంగా కూడా నెక్స్‌ లెవల్లో సినిమా ఉంటుందని, త్వరలోనే పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం చెపుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: నవీన్‌ కుమార్‌.ఐ, సంగీతం: సి.ఉదయ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News