Namaste NRI

విజయ్ ఆంటోనీ హిట్లర్ ట్రైలర్ రిలీజ్

విజయ్‌ ఆంటోనీ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ హిట్లర్‌. రియా సుమన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రధారులు. ధన దర్శకత్వం. డీటీ రాజా, డీఆర్‌ సంజయ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ప్రపంచంలో నిజమైన పవర్‌ అంటే డబ్బు, అధికారం కాదు. ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. విజయ్‌ ఆంటోని డిఫరెంట్‌ గెటప్స్‌లో అధారాలు దొరక్కుండా ముగ్గుర్ని చంపేస్తాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తుంటారు. ఈ యాక్షన్‌ సీన్లతోపాటు హీరోయిన్‌తో రొమాంటిక్‌ లవ్‌స్టోరీ కూడా ట్రైలర్‌లో రివీలైంది. స్వార్థపూరిత రాజకీయ నాయకుడి గా చరణ్‌రాజ్‌ కనిపించారు. మొత్తంగా పొలిటికల్‌, యాక్షన్‌, లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ సాగింది. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ నెల 27న పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం విడుదల కానుంది.   ఈ చిత్రానికి కెమెరా: నవీన్‌ కుమార్‌.ఐ, సంగీతం: వివేక్‌, మెర్విన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress