Skip to main content

Namaste NRI

విజయ్‌ ఆంటోని మార్గన్‌ విడుదల ఖరారు

విజయ్‌ ఆంటోని నటిస్తున్న చిత్రం మార్గన్‌. లియోజాన్‌ పాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్నది. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ నేపథ్యంలో విజయ్‌ ఆంటోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. విజయ్‌ ఆంటోని పాత్ర శక్తివంతంగా సాగుతుంది. కథలోని ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ అందరిని ఆకట్టుకుంటాయి అని మేకర్స్‌ తెలిపారు. అజయ్‌ దీపన్‌, సముద్రఖని, శంకర్‌, ప్రీతిక, బ్రిగిడా తదితరులు నటిస్తున్నారు.  జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, రచన-దర్శకత్వం: లియో జాన్‌పాల్‌.

Social Share Spread Message

Latest News