Skip to main content

Namaste NRI

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా విజయ్‌ ఆంటోని  భద్రకాళి

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భద్రకాళి. అరుణ్‌ప్రభు దర్శకుడు. సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలుగులో విడుదల చేస్తున్నది.

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, విజయ్‌ ఆంటోని పాత్ర కొత్త పంథాలో ఉంటుందని, అసాంఘిక శక్తులపై ఓ వ్యక్తి చేసే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తమని మేకర్స్‌ తెలిపారు. వాగై చంద్రశేఖర్‌, సునీల్‌ కృపలానీ, సెల్‌ మురుగన్‌, తృప్తి రవీంద్ర తదితరులు నటిస్తున్నారు.సెప్టెంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, దర్శకత్వం: అరుణ్‌ప్రభు.

Social Share Spread Message

Latest News